విపక్ష నేత జగన్ లో మార్పు వస్తోందా
విపక్ష నేత జగన్ లో మార్పు వస్తోందా....? గతంలో వ్యవహరించిన శైలికి , ప్రస్తుతం అనుసరిస్తున్న దోరణికి కొంత మార్పు కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జగన్ ఏదైనా నిర్ణయం తీసుకుని ,దానిని ఎలా అమలు చేయాలన్నదానిపై మాట్లాడేవారని,కాని ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ముందే నాయకులతో చర్చిస్తున్నారని చెబుతున్నారు.లోటస్ పాండ్ లో గురువారం నాడు జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన విభిన్నంగా వ్యవహరించారని చెబుతున్నారు. ప్రత్యేక హోదా పై ఎలాంటి ఆందోళన చేయాలి? అలాగే ఆయా అంశాలపై పార్టీ రాజకీయ పందా ఎలా ఉండాలి?పార్టీ విధానాలలో ఏమైనా మార్పు అవసరమా?అని జగన్ అడిగారని సమాచారం. తనలో కూడా ఏమైనా మార్పులు అవసరమైతే చెప్పండని కూడా అన్నారని కధనాలు వస్తున్నాయి.పార్టీ నేతలు కూడా స్వేచ్చగా తమ అబిప్రాయాలు చెప్పారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.ఇది మంచి పరిణామమని ఆయన అన్నారు. దీనివల్ల అందరిని భాగస్వాములను చేశారన్న అబిప్రాయం కలుగుతుందన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








